\

బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు వారికి అవమానం అంటూ ప్రచారం చేసిన

బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు వారికి అవమానం అంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు: టిటిడి

తిరుమల,2025, జనవరి 29.: ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారి తిరుమల యాత్రలో భాగంగా టిటిడిలో అవమానం అంటూ దుష్ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో జనవరి 28, 2025న టిటిడి ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిర్వాహకులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నెం. 13/2025 గా నమోదైంది.

బ్రహ్మర్షి డా. చాగంటి కోటేశ్వర రావు గారి తిరుమల పర్యటనపై వాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా టిటిడి వెల్లడించినా, సదరు సోషల్ మీడియా ప్రతినిధులు 1. డయల్ న్యూస్, హైదరాబాద్, (2.)పోస్ట్ 360, హైదరాబాద్, (3.)జర్నలిస్ట్ వైఎన్ఆర్ , (YNR) హైదరాబాద్, వారు పదే పదే టిటిడి ప్రతిష్టను దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేశారు. దీంతో సదరు ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో పాటు న్యూఢిల్లీలో, విజయవాడ లో గల పిఐబీ (ప్రెస్ ఇస్పర్మెషన్ బ్యూరో) వారికి ఫిర్యాదు చేయడమైనది. అదేవిధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాగంటి కోటేశ్వర రావు గారి ఆద్యాత్మిక అభిమానుల మనోస్థైర్యాన్ని పలుచన చేసేలా విష ప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్స్ లను రద్దు చేయాలని యూట్యూబ్ మేటా మేనేజ్మెంట్ వారికి కూడా ఫిర్యాదు చేయడమైనది.

Also Read: Nandakam Guest House Room Booking Online, Availability Tirumala

Read: TTD VIP Break Darshan Online Tickets Process Timing

వాస్తవానికి డా. చాగంటి కోటేశ్వర రావు గారికి జనవరి 14న శ్రీవారి దర్శనం, జనవరి 16వ తేదీ సాయంత్రం టిటిడికి చెందిన మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు 2024, డిసెంబర్ 20న టిటిడి ప్రొసిడింగ్స్ ఇచ్చింది. వారికి ఉన్న కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసింది. అందులోభాగంగా, రాంబగీఛ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెల్లేందుకు బ్యాటరీ వాహనాలను, శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టిటిడి ఏర్పాట్లను చేసింది. టిటిడి చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను వారు సున్నితంగా తిరస్కరించి, సామాన్య భక్తుల తరహాలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకురుకుంటానని వారే స్వయంగా వెల్లడించి శ్రీవారిని దర్శించుకున్నారు. జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో శ్రీ చాగంటి వారి ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేస్తే బాగుంటుందని వారి దృష్టికి టిటిడి ఉన్నతాధికారులు తీసుకెళ్లగా, ఈ విన్నపాన్ని శ్రీ చాగంటి వారు అంగీకరించారు. తదుపరి వారి అనుమతి తేదీలను మరోసారి తీసుకుని ప్రవచనాలు ఇచ్చేందుకు టిటిడి నిర్ణయించింది. వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా శ్రీ చాగంటి వారి ప్రవచనాల కార్యక్రమాన్ని టిటిడి రద్దు చేసినట్లు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేశారు.

శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే కాకుండా , ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్ట ఉన్న టిటిడి సంస్థను పలుచన చేస్తూ ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను పదే పదే దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపైనా, సంస్థలపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *