రథసప్తమి సందర్భంగా తిరుమలలో దివ్య వైభవం – సూర్యప్రభ వాహనంపై శ్రీ మన్నారాయణుడు
తిరుమలలో రథ సప్తమి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీవారి భక్తులకు ‘మినీ బ్రహ్మోత్సవం’గా భావించే రథసప్తమి వేడుకలు తిరుమల గిరులలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమల మలయప్ప స్వామి వారు సప్త వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వడం ఒక నేత్రపర్వం. ఈ వేడుకలో అత్యంత కీలకమైన ఘట్టం.. సూర్యప్రభ వాహన సేవ. తిరుమల లో ఉత్సవాలు చూడడానికి కూడా అదృష్టం ఉండాలేమో. అనేంత వైభవంగా జరుగుతున్నాయి. భానుడి కిరణాల…
